సినీ లెజెండ్ కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని, వారితో చాలా ప్రమాదం ఉందనే అర్థంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు చేయడంతో చాలామంది పౌరులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అయితే కమల్ హాసన్‌కు విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. మతం, సంప్రదాయం పేరిట ప్రజల్లో వణుకు పుట్టించడం ఉగ్రవాదం కాక మరేంటని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు.