కలియుగ విశ్వరూపం ఏంటి? పరిపాలన ఎలా ఉంటుంది.?

గురువారం, 25 జూన్ 2015 (17:29 IST)
కలియుగ విశ్వరూపం ఏంటి? ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. కలియుగంలో రాజులు ధర్మ, సత్య, దయా హీనులై, క్రోధ మత్సరాలలో స్త్రీలను, బాలలను హింసిస్తూ, చంపుతూ ఉంటారు. 
 
పరధన, పరస్త్రీ లోలులై రజస్తమోగుణ రహితులై తమలో తాము కలహించుకునే పరిపాలకులనే ప్రజలు కూడా వారిని అనుసరిస్తారు. ఫలితంగా రోజురోజుకూ ధర్మం నశింపసాగింది. ధనవంతుడే రాజవుతాడు. బలవంతుడే గుణవంతుడుగా మెప్పునందుకుంటాడు. ధనము, బలము కలిగినవాడే రాజగును. ప్రజలు అల్పాయుష్కులవుతారు. రాజులు చోరులై ప్రజలను దోపిడీ చేస్తారు. 
 
వర్షాలు పడవు. పంటలు పండవు. భూములను ఆక్రమించి, గర్వాంధులైన నరపతులను చూసి భూమి ఫక్కున నవ్వును. ఈ భూమికి తామే నాథులమని విర్రవీగే వారిని మోహమున పితృపుత్ర సోదరులకు భ్రాంతి కలుగజేసి, అన్యోన్య వైరములచేత, కలహములు కలిగించి ఒకరిచేతిలో మరొకరు మరణించేలా చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి