ఆదివారం జూన్ 21న సూర్యగ్రహణం, దర్బను ఎందుకు వేస్తారు?

బుధవారం, 17 జూన్ 2020 (23:45 IST)
ఈ నెల ఆదివారం 21వ తేదీన సూర్యగ్రహణం రాబోతోంది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన నియమాలలో కొన్నింటిని చూద్దాం. ముఖ్యంగా గ్రహణం పట్టే సమయానికి ముందు అన్ని పదార్థాలపై దర్బలను వేయడం చేస్తుంటారు. ఈ దర్బలను ఎందుకు వేయాలి? దర్బకు నెగటివ్ పవర్‌ని దూరం చేసే గుణం ఉందని చెపుతారు. అందువల్ల అలాంటి దర్బను వేయడం వల్ల ఆహారంలోకి వచ్చే నెగటివ్ బాక్టీరియాని అది ఆకర్షిస్తుంది. కాబట్టి గ్రహణం ముగిసిన తర్వాత వాటిని తీసి పడేయాలి.
 
ఇకపోతే గ్రహణం పట్టే సమయానికి విడిచిన తర్వాత పట్టు విడుపు స్నానం చేయాలి. మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు జపం చేయడం అధిక ఫలితాన్నిస్తే మంత్రోపదేశం లేని వారు తమ కుల దేవత నామస్మరణ చేయడం వల్ల శుభం కలుగుతుంది. 
 
అనారోగ్యంతో ఉన్న వారు గ్రహణ సమయమంతా ఏమీ తినకుండా ఉండలేరు కనుక గ్రహణం పట్టక ముందే తినడం మేలు. ఆరోగ్యంగా ఉన్న వారు గ్రహణానికి ముందు 6 గంటలు ఆహారం తీసుకోకూడదన్నది విశ్వాసం. ఇక గ్రహణం విడిచాక తలస్నానం చేసిన తర్వాత పూజ గదిలో దేవుడి ముందు దీపం పెట్టాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు