చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?

బుధవారం, 23 ఆగస్టు 2017 (19:53 IST)
ఏ దేవుని మాలలో ఏ దారాలు వాడాలంటే విష్ణుమాలలో నల్లటి పట్టుదిగాని, నూలు దారం గాని వాడాలి. అమ్మవారికి ఎర్రటి పట్టుదారం మాలగానూ, పరమశివునకు పసుపు ఊలుదారమూ, సూర్యభగవానుడికి పట్టుదారముగాని నూలు దారం గాని, వినాయకుడికి ఆకుపచ్చ పట్టుదారమూ, నూలు దారమూ వాడాలి. 
 
దరించే వ్యక్తి గాని లేదా తన ఇంటిపేరుతో ఉన్న వారు గాని దారాన్ని చుట్టాలి. తన కోసం తన చుట్టింది ధరించడం అత్యంత శక్తివంతమైనది. వేరే ఎవరైనా చుట్టిన మాల ధరించే ముందు పంచగవ్యములతో  శుద్ధి చేసి ధరించాలి. 
 
చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారంటే నేనెంతో ధనం సంపాదించాను.. ఒక్క పైసా కూడా తీసుకెళ్ళడం లేదు. రేపు మీ ధనమయినా ఇంతే. కనుక ధర్మంగా న్యాయంగా, జీవిస్తూ పదిమందికీ సాయం చేసి పోవడమే అసలు మానవ ధర్మమని కాబట్టి మీరయినా స్వార్థ చింతనలకు దూరంగా ఉండి పదిమందికి మేలు చేయండని దాని అర్థం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు