శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు. అంతకుముందు రోజు శివుడిని ఆరాధించటం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుంది. సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలిగి పోతాయి. పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంత ఇష్టమైనదో, శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమైనది.
అలాగే శ్రావణ సోమవారం జల రూపంలో ఉన్న శివుడికి పూజ చేస్తూ, "ఓం భవాయ జల మూర్తయే నమః" అనే మంత్రం పఠించాలి. ముఖ్యంగా మందారపువ్వు, జిల్లేడు పువ్వు, గన్నేరు పూలతో పూజ చెయ్యాలనీ, ప్రధానంగా గన్నేరు పువ్వుతో పూజ చేస్తే, 1000 గోవులు దానం చేసిన ఫలితం దక్కుతుంది.
లింగ పురాణంలో శివుడికి నిమ్మకాయలు, దానిమ్మపండ్లు, నేరేడుపండ్లు, అరటి పండ్లు, పనస పండు, జామకాయల రసంతో అభిషేకం చేస్తే సులభంగా పరమేశ్వరుడిని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.