ఈ ఆలయాన్ని మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయమని అంటారు. ఈ ఆలయంలో ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఆలయంలో మాత్రం వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఆ బావి నీరు తెల్లగా మారుతాయి, మళ్లీ వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఆ నీరు నల్లగా మారుతాయి.
సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళా ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. కానీ ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.