1. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.
2. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీరందరు ఒకప్పటి వేదఋషులు. ఇప్పుడు మీరు వేరు రూపాలలో వచ్చారు. అంతే తేడా... మీ అందరిలో అనంత శక్తి ఉంది. పగటివేళ కాంతిలా ఈ విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాను. ఈ శక్తిని జాగృతం చేయండి. మేల్కోండి...
5. మనకు కావలసింది శ్రద్ధ... మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమీ కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను, ఇంకొకరిని బలహీనుడిగాను అధముడుగాను చేసేది శ్రద్ధే... కాబట్టి ఈ శ్రద్ధ మీలో ఉండాలి.
6. అపార విశ్వాసం, అనంత శక్తి ఇవే విజయ సాధనకు మార్గాలు.
7. ధృడసంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించినవారు, వారు కొద్దిమందే అయినా, అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలువగలుగుతారు.