01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

రామన్

మంగళవారం, 31 మార్చి 2026 (19:49 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలించవు. ఖర్చులు విపరీతం. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య తరచు కలహాలు తప్పవు. సౌమ్యంగా మెలగండి. పంతాలకు పోవద్దు. తరుచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. సంతానం విజయం ఉత్సాహం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అవివాహితులకు శుభయోగం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో అలసత్వం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందికి దారితీస్తుంది. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు, అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రధమార్థం అనుకూలం. ప్రతి విషయంలోను ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు. స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనాలు వేయొద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త పనులు చేపడతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. సంతానం ఉన్నత చదువుల కోసం పని చేస్తారు.  కీలక పత్రాలు అందుకుంటారు. ద్వితీయార్థం అప్రమత్తంగా ఉండాలి. వ్యవహార లావాదేవీల్లో మెలకువ వహించండి. ధనప్రలోభాలకు గురికావద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యం జాగ్రట్ల చిన్నవాటి పరిచయస్తులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఆదాయం సంతృప్తికరం. పెద్దఖర్చు తగిలే అస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య అవగాహన లోపం, చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఊహించని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విందులు, వేడుకకు హాజరవుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం అనుకూలదాయకం. పరిస్థితులు క్రమంగా కుదుటపడతాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. ఫోన్ సందేశాలు, ప్రకటనలు విశ్వసించవచ్చు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి సామాన్యం. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపారాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతోషకరమైన వార్త వింటారు. ఒక వ్యవవారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణం విరమించుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సామాన్యం, ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సంతానం మంచి ఫలితాలు సాధిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి ఉపాధ్యాయులు, తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం సర్వత్రా యోగదాయకమే వ్యవహార జయం, కార్యసిద్ధి ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టుబడులు ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు, రసీదులు జాగ్రత్త. అనవసర బాధ్యతలతో ఇబ్బందులకు గురవుతారు. ఆప్తులతో తరచు సంభాషిస్తుంటారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త క్రమం తప్పకుండా ఔషధ సేవనం పాటించండి. సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం పిల్లలకివ్వవద్దు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయండి. పంతాలు, పట్టింపులకు పోవద్దు. లౌక్యంగా ఉండాలి. తప్పటడుగు వేసే అస్కారం ఉంది. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు సంస్థలు, ప్రాజెక్టులకు అనుకూలం. దంపతుల మధ్య దాపరికం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరువుతారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. సంతానం పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. మొండి ధైర్యంతో మెలగండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అన్ని రంగాల వారికి యోగదాయకమే. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ కలుపుగోలుతనం అందరిని ఆకట్టుకుంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. చాకచక్యంగా వ్యవహారాలు చక్కపెట్టుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించింది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉంచాలి. ముఖ్యమైన వివరాలు గోప్యంగా ఉంచడం మంచిది. పరిచయస్తుల ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సత్కాలం సమీపిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కళ్యాణ మండపాలు అన్వేషిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఇతరులను మీ విషయాలను దూరంగా ఉంచండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మీ శ్రీమతి ఆరోగ్యం మటపడుతుంది. తనను ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ముఖ్యమైన న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణింపు, అనుభవం గడిస్తారు. దీర్ఘకాలిక సమస్య నుంచి విముక్తులవుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అస్కారం లేదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త, అపరిచితులు మోసగించే ఆస్కారం ఉంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సన్నిహితులతో తరచు సంభాషిస్తుంటారు. సంతానానికి శుభం. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. దంపతుల మధ్య స్వల్ప కలహం సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఒకరి జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. కొత్త యత్నాలు చేపడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. కొన్ని వ్యవహారాలు ధనంతో ముడిపడి ఉంటాయి. ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య నుంచి విముక్తులవుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడిగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. బెట్టింగ్స్ జోలికిపోవద్దు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు