ధనం, పేరుప్రతిష్టలు, విద్య వల్ల ప్రయోజనం లేదు... మరి? వివేకానంద సూక్తులు

శుక్రవారం, 15 జూన్ 2018 (20:49 IST)
దేనికీ భయపడకండి. మీరు అద్భుతాలను సాధించగలరు. భయపడిన మరుక్షణమే మీరు పనికిరాని వారవుతారు. లోకములోని దఃఖమంతటికి మూలకారణం ఈ భయమే. భయమే సర్వబంధ కారణి. నిర్ణయత్వం ఒక్క క్షణంలో సైతం స్వర్గాన్ని ప్రాప్తింపజేయగలదు.
 
2. వీరులై ఉండండి.... ధీరులై ఉండండి... మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. నా శిష్యులు పిరికిపందలు కాకూడదు.
 
3. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేనినీ సాధించలేము.
 
4. ధనం వల్ల, పేరుప్రతిష్టల వల్ల, విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మంచి శీలం మాత్రమే దుస్సాధ్యమైన కష్టాల అడ్డుగోడలను పగలకొట్టుకుని ముందుకు చొచ్చుకుపోతుంది.
 
5. మొదట ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. మీరు చిన్న బుడగ లాంటివారై ఉండవచ్చు. ఇంకొకరు శిఖరాగ్రమంత ఎత్తైన కెరటమే కావచ్చు. అయినా... అపరిమితమైన సముద్రము ఆ రెండింటికి ఆధారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు