తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందో ఎవరికీ తెలియదు. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు ఉన్నది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశం. తెల్లవారుజామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు.
శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్కటి అద్భుతమే. హుండీ, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబీ, లడ్డు, పాయసం, దోస, రవ్వ, కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజు తయారు చేస్తారు.
ఇక స్వామివారి వస్త్రాల సంగతికి వస్తే స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు. ఆరు కిలోల బరువును కలిగి ఉంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వ దళాలతో అర్చన చేస్తారు. పండుగ నెల అంతటా బిల్వ దళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాఢా వీధుల్లో వూరేగిస్తారు.