కొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తుంటారు. ఈ విధంగా ఉద్దేశ పూర్వకంగా దీపారాధనను కొండెక్కించకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే దీపారాధన ఉన్నంత వరకు తలుపులు తెరచి ఉంచవలసిన పనిలేదని అంటోంది. భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తరువాత పూజ గది తలుపులను వేయవచ్చని చెప్పబడుతోంది. ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషం కలుగదు.