ఇంట్లో తులసి చెట్టును ఏ దిశలో ఉంచుకోవాలంటే....

గురువారం, 21 జూన్ 2018 (13:47 IST)
తులసిని దేవతగా భావించి ఇంట్లో ఉంచి పూజలు చేస్తుంటారు. హిందువులు దేవతగా పూజించే తులసి చెట్టును ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే కొత్త ఇంటిలో దీనిని ఎక్కడ ఏ విధంగా, ఏ దిశలో, ఏ వైపు నిర్మించుకోవాలన్న విషయాలను తెలుసుకుందాం. తులసి చెట్టును నిర్మించాలనుకునేవారు దాని చుట్టూ తిరిగే విధంగా స్థలాన్ని కూడా ఏర్పరచుకోవాలి. అలాగని వీటిని ప్రహరీ గోడలకు ఆనించి నిర్మించకూడదు.
 
ఉత్తర వాయవ్యంలో లేదా తూర్పు వాయవ్యంలో తులసి చెట్టును అమర్చాలనుకుంటే నేల ఎత్తుకంటే కాస్త తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. పశ్చిమ దిశలో నైరుతి లేదా వాయవ్య దిశలో తులసి చెట్టును నిర్మించాలంటే నేల ఎత్తుగా లేకుండా పల్లంగా ఉండే స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి. 
 
తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలలో తులసి చెట్టులను ఉంచకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో బరువు ఎక్కువై చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అయితే పూర్వంలాగా ప్రస్తుత కాలంలో తులసికి కోటలు కట్టడం లేదు. పూల మొక్కలు పెంచే కుండీలలోనే పెంచుతున్నారు. అయినప్పటికీ, వీటిని దక్షిణ ఆగ్నేయ, పశ్చిమ వాయవ్య దిశలలో పెట్టుకుంటే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు