గుడి నీడ ఇంటి మీద పడే విధంగా ఇల్లు నిర్మిచకూడదంటారు. ఎందుకు గుడినీడ ఇంటి మీద పడకూడదంటే గుడికి దగ్గర ఇల్లు నిర్మించరాదని అర్థం. ఆలయం అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఆ శక్తి గుడి పరినరాలను ప్రభావితం చేస్తుంది.
కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు. అందుకనే పురాతన గుళ్ళుచూసినట్లైతే గర్భగుడి చుట్టూ ఒకటికంటే ఎక్కువ ప్రహరీ గోడలు నిర్మించి ఉండటం గమనించవచ్చును. అందువలన గుడి గోడ నీడ పడే విధంగా ఇంటిని నిర్మించకుండా ఉంటే మంచిది.