ఒకసారి ఓ స్త్రీ శిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు. బాబా పాదాల ముందు కూర్చుని, మూడు రోజులు ఉపవాస వ్రతం చేయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. మనిషి పరమార్థం విచారణ చేయడానికి సిద్ధపడ్డప్పుడు అతడికి యుక్తమైన ఆహారం అత్యవసరం అని బాబా చెప్పేవాడు. బాబా క్లేశకర, కఠిన తపస్సాధనలను ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. బాబా ఆమెకి చక్కని బోధ చేశారు.