స్త్రీలకు ప్రవేశం లేని పూణే కార్తికేయుని ఆలయం!

శుక్రవారం, 31 జనవరి 2014 (19:39 IST)
FILE
స్త్రీలకు ప్రవేశం లేని ఆలయం అంటే మనకు తెలిసింది శబరిమల అయ్యప్పస్వామి ఆలయం. అది కూడా యుక్త వయస్సు వచ్చిన పడుచులకు ఈ ఆలయంలో ప్రవేశముండదు.

అయితే స్త్రీలకు అసలు ప్రవేశమేలేని ఆలయం ఒకటుంది. ఆ ఆలయంలోని స్వామి బ్రహ్మచారి కావడంతో స్త్రీలకు ప్రవేశము లేదు. మహారాష్ట్రలోని పూణే నగరానికి సమీపంలో పార్వతీ కనుమలు ఉన్నాయి. ఈ పర్వతాలలో కుమారస్వామి ఆలయం ఉంది.

ఈ ఆలయంలోని కుమారస్వామి కార్తికేయుడు అనే పేరుతో పిలువబడుతుంటాడు. ఆరు ముఖాలతో, నెమలి వాహనంపై భక్తులను కరుణిస్తుంటాడు. ఆలయంలో ఉన్న తెల్లని పాలరాతి విగ్రహం ఆభరణాలు అలంకరించుకుని కోరి వచ్చిన భక్తుల కోర్కెలను తీరుస్తుంటుంది. ఈ కార్తికేయుడికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.

ఎప్పుడూ ఇద్దరు భార్యలయిన వల్లీ- దేవయానిలతో ఉండే కుమారస్వామి ఈ ఆలయంలో మాత్రం ఒంటరిగానే ఉంటాడు. బ్రహ్మచారిగా వెలిసినందున ఆలయంలో స్త్రీలకు ప్రవేశం లేదు.

వెబ్దునియా పై చదవండి