* స్త్రీలు రాత్రి పూట గాజులు, కమ్మలు తీయరాదు.
* చనిపోయిన వారి ఇంట కార్యానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు. దుఃఖం విచారించ వచ్చిన వారిని ఇంటికి ఆహ్వానించకూడదు. అలా చేస్తే పరోక్షంగా మనము అశుభములను కోరుకోవడానికి నాంది అవుతుంది.
* పెళ్ళి అయిన స్త్రీలునలుపు రంగు వస్తువులు, బట్టలు ధరించ కూడదు.
* ఇంట్లో ఉన్న ఉప్పు, మిరపకాయ, చింతపండు, గుడ్లు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు. కింద పెట్టండి వాళ్ళే తీసుకుంటారు.
* ఇంటిలో పేరుకుపోయిన దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్య్ర హేతువు. అందువల్ల ఇంటిని పదిరోజులకు ఒకసారి మంగళ, శుక్ర వారములు కాకుండా మిగిలిన రోజులలో దులిపి శుభ్రం చేసుకోవాలి.