తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వెంకన్నకు స్వర్ణ కిరీటం, పాదపద్మములు

మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:16 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. 
 
సోమవారం శ్రీవారిని 75,819 మంది దర్శించుకున్నారు. 29,794 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ.3.08 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని వారు చెప్పారు.
 
మరోవైపు కలియుగ దైవం తిరుమల వేంకటేశునికి ఓ భక్తుడు రూ.28 లక్షల విలువైన స్వర్ణ కిరీటం, రూ. 2 లక్షల విలువైన పాదపద్మములను బహూకరించాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియత్తానికి చెందిన కె.దొరస్వామి దంపతులు శ్రీవారి భక్తులు. 
 
సోమవారం స్వామి వారిని దర్శించుకున్న వీరు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను కలిసి స్వర్ణ కిరీటం, 1600 గ్రాముల బరువుగల రెండు పాదపద్మములను బహూకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు