సముద్రగుప్త, విక్రమాదిత్య కాలం 1076 - 1126 సీఈకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉందని, అప్పుడే రామ్ లల్లా అని 56 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారనీ, ఇపుడు మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయం పునః నిర్మించారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనపుడు... మన చరిత్రని పరిగణలోకి తీసుకొని అదే బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నారు.
బాల రాముడు వయసు 5-6 సంవత్సరాల మధ్య ఉండే విధంగా మలిచారనీ, అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భగుడిలో బాల రాముడు వారు ఉన్నారనీ, ఇంకా 2 అంతస్తులు ఉన్నాయని తెలిపారు. పైగా, గుడి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత సీతరాములు, లక్ష్మణ, హనుమ స్వామితో సహా పలు విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, అలాగే మాతకౌసల్య దేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారని, జై శ్రీరామ్ అంటూ తన సమాధానమిచ్చారు.