జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు

గురువారం, 30 డిశెంబరు 2021 (20:18 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. నిత్యకళ్యాణం పచ్చతోరణం అన్న విధంగా సంవత్సరం మొత్తం విశేష ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.

 
ఈ యేడాది ఎలాంటి విశేష ఉత్సవాలను నిర్వహిస్తామన్న విషయాన్ని టిటిడి స్పష్టం చేసింది. ముఖ్యంగా జనవరి 2వ తేదీన అధ్యయనోత్సవాలు ప్రారంభిస్తామని టిటిడి తెలియజేసింది.

 
అలాగే జనవరి 13వ తేదీన వైకుంఠ  ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు, జనవరి 14వ తేదీన వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీ తీర్థ ముక్కోటీ, భోగి పండుగ, జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి వేడుకలు జరుగనున్నాయి.

 
అలాగే జనవరి 16వ తేదీన శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 18వ తేదీన శ్రీవారి ప్రణయ కలహమహోత్సవం, జనవరి 22వ తేదీన తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్దశాత్తుమొర, వైకుంఠ ద్వార దర్సనం ముగింపులు జరుగనున్నాయి.

 
అంతేకాకుండా జనవరి 26వ తేదీన శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు కూడా జరుగనుంది. జనవరి 27వ తేదీన శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు నిర్వహించనున్నారు. టిటిడి మొదటగా జనవరి నెలకు సంబంధించిన విశేష ఉత్సవాలను మాత్రమే విడుదల చేసింది. మిగిలిన నెలలకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు