మొదటి రోజు ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యహ వచనం, యాగశాల ప్రవేశం, గంటాపరాధన, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు నీరాజన మంత్ర పుష్పం, సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, అరుణ హోమం, రాత్రి 7.30 గంటలకు మహా హారతి, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి.
రెండో రోజు శనివారం స్థాపిత దేవత అవనములు, చండీ పారాయణం, సరస్వతీ హోమం, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించనున్నారు. శుక్రవారం జరిగే ఉత్సవాల్లో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి పాల్గొననున్నారు.
ఈ ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి అభిషేకం, రుద్ర స్వాహాకారం, సరస్వతీ హోమం, 10 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిస్తారు. ఉదయం 8.30 గంటలకు వేద మహార్షి ఆలయంలో రుద్రాభిషేకం, వేద స్వస్తి, స్వామి వారి అలంకరణ తదితర పూజల నిర్వహించి అనంతరం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో సేవలందిస్తున్న వేద పండితులకు సన్మానించనున్నారు.