తిరుచానూరు చేరుకోనున్న లక్ష్మీ కాసుల హారం

శనివారం, 22 నవంబరు 2014 (20:43 IST)
కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహనం సందర్భంగా లక్ష్మీకాసుల హారం ఆదివారం తిరుచానూరు చేరుకోనున్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ హారంలో 500 లక్ష్మీ కాసులు ఉంటాయి. ఆ కాసులన్నింటిపైనా లక్ష్మీ ప్రతిమను ముద్రించి ఉంటారు. 

 
నాలుగు వరుసలు ఉన్న ఈ హారం నిలువెత్తున ఉంటుంది. దీనిని సాధారణంగా తిరుమల శ్రీవారి గరుడోత్సవం సందర్భంగా వినియోగిస్తారు. అదేసమయంలో తిరుమల వేంకటేశ్వర స్వామి ఎంతో ఇష్టమైన పద్మావతీ అమ్మవారి గజవాహనం సందర్భంగా కూడా ఇదే హారాన్ని వినియోగిస్తారు. 
 
దీనిని ఆదివారం ఉదయం 10.30 గంటలకు తిరుచానూరుకు తీసుకువస్తారు. అనంతరం సాయంత్రం జరిగే గజవాహనంలో భాగంగా అమ్మవారికి అలంకరిస్తారు.

వెబ్దునియా పై చదవండి