కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుంటారు. ఇంకా టీటీడీ కూడా శ్రీవారికి కొన్ని వాహనాలు, ఆభరణాలను చేయిస్తుంది. తాజాగా శ్రీవారి వాహనాల్లో సరికొత్త సర్వభూపాల వాహనం చేరింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఉపయోగిస్తున్న సర్వభూపాల వాహనం బరువుగా ఉండటంతో.. కొత్త వాహనాన్ని రూపొందించారు.
ఇప్పటివరకు శ్రీవారు ఊరేగిన సర్వభూపాల వాహనం బరువుతో పాటు.. దానిపై మలయప్ప స్వామి ఊరేగుతున్న వేళ... భక్తులకు సరైన దర్శనం లభించలేదని ఫిర్యాదు అందడంతో కొత్త వాహనాన్ని రూపొందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వాహనం 16 అడుగుల ఎత్తును కలిగివుంటుంది. ఈ వాహనానికి తొమ్మిది కిలోల బంగారంతో తాపడం పనులు చేయించారు.