తిరుమలలో రథసప్తమి వేడుకలు (Video)

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:49 IST)
ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల భక్తులతో పోటెత్తింది. రథసప్తమి పర్వదినం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ఉదయం నుంచి సప్తవాహనాలపై స్వామి వారు వూరేగుతూ భక్తులకు దర్సనమిస్తున్నారు. రథసప్తమి అంటే సూర్యుని పుట్టినరోజు. అందుకే మొదటగా సూర్యప్రభ వాహనాన్ని నిర్వహించారు. 
 
అలాగే చిన్నశేషవాహనం, గరుడవాహనం, హనుమంత వాహనం, చక్రస్నానం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభవాహనం, సింహవాహనం, అశ్వవాహనం, గరుడవాహనం, పెద్దశేషవాహనం, చంద్రప్రభవాహనం, గజవాహనసేవలపై స్వామివారు వూరేగుతున్నారు. తిరుమల మాత్రమే కాకుండా తిరుచానూరు, గోవిందరాజస్వామి ఆలయాల్లో కూడా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి.
 

వెబ్దునియా పై చదవండి