నేటి నుంచి అయ్యప్ప దర్శనం - ఆర్టీపీసీఆర్ రిపోర్టు ఉంటేనే ఎంట్రీ

శనివారం, 17 జులై 2021 (09:43 IST)
కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని శనివారం నుంచి తెరవనున్నారు. శనివారం నుంచి జులై 21 వరకు జరిగే నెలవారీ పూజా కార్యక్రమాల కోసం భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. 
 
అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా ధృవీరకణ పత్రం సమర్పించాల్సివుంటుంది. అలాగే, కరోనా ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు. 
 
ఆన్​లైన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాల్సివుంటుంది. లేనిపక్షంలో ఆలయంలోకి అనుమతించరు. అయితే, భక్తులను రోజుకు గరిష్టంగా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు