పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?

సెల్వి

శుక్రవారం, 24 అక్టోబరు 2025 (20:26 IST)
Varahi Pooja
పంచమి రోజున వారాహి దేవిని పూజించే వారికి ఓటమి అనేదే వుండదు. శత్రుబాధ వుండకూడదంటే.. ఉద్యోగం, వ్యాపారంలో రాణించాలంటే.. వారాహి దేవిని పూజించాలి. నరదృష్టి, మంత్రతంత్రాలను దరిచేరనివ్వదు. అందుకే వారాహికి పంచమి తిథి రోజున పూజ చేయాలని అంటున్నారు. 
 
వారాహి దేవికి నీలం, నలుపు, రంగు అంటే ప్రీతికరం. శంఖుపుష్పాలు, కృష్ణ తులసి, బిల్వ పత్రాలు అంటే ఇష్టం. పౌర్ణమి రోజున కూడా వారాహి దేవికి పూజ చేయవచ్చు. ఇంకా పంచమి, అష్టమి, దశమి తిథుల్లో కూడా ఆమెకు పూజ చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. అయితే రాత్రి 8 గంటల నుంచి 10 గంటలోపు ఇంట్లోనే వారాహి దేవిని పూజించవచ్చు. 
 
ఈ పూజ చేసేటప్పుడు భూమికి కింద పండే దుంపలను ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. తేనె కలిపిన దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే వారాహి దేవికి అల్లం, వెల్లుల్లి, పొట్టు తీయని నల్ల మినపప్పుతో చేసిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తే సకల అభీష్టాలు చేకూరుతాయి. అలాగే మిరియాలతో చేసిన గారెలు, వెన్నను తొలగించని పెరుగన్నం నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
అంతేగాకుండా.. మిరియాలు, జీలకర్రతో చేసిన దోసెలు, పంచదార, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం కలిపిన పాలు, నల్ల నువ్వులతో చేసిన ఉండలు, శొంఠి కలిపిన పానకం నైవేద్యంగా సమర్పించడం ద్వారా జీవితంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా తెల్ల బీన్స్ గింజలను ఉడికించి, తేనె, నెయ్యిని కలిపి వారాహి దేవికి సమర్పిస్తే ధనవృద్ధి చేకూరుతుంది. వ్యాపారంలో లాభం గడిస్తారు. కోర్టు కేసుల్లో జయం లభిస్తుంది. 
 
ఈతిబాధలు తొలగిపోతాయి. రుణ బాధలు వుండవు. వారాహిని పూజించే వారికి శత్రు బాధ వుండదు. ఐదు పంచమి తిథుల్లో ఆదివారం పూట కొబ్బరి దీపం అమ్మవారికి వెలిగిస్తే.. అనుకున్న కార్యాల్లో విజయం తథ్యం. వారాహి దేవిని సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని పూజించవచ్చు. 
 
12 రాశుల్లో వృషభం, కర్కాటకం, కన్యారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి జాతకులు వారాహి దేవిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. కృష్ణ, శుక్ల పంచమి తిథుల్లో వారాహిని పూజించడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు