ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

బుధవారం, 12 అక్టోబరు 2022 (08:49 IST)
శ్రీవారి పుణ్యక్షేత్రం రెండు రోజులపాటు మూతపడనుంది. ఈ నెల 25వ తేదీన, నవంబరు 8వ తేదీన ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణాల సమయంలో శ్రీవారి ఆలయంలో భక్తుల సందర్శనాన్ని 12 గంటల పాటు నిలిపి వేస్తామని ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని తితిదే అధికారులు కోరారు. 
 
ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం, నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం రాహనున్నాయి. ఈ గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజులపాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తితిదే వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటల పాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలను అనుమతించబోమని తెలిపింది. 
 
గ్రహణం సమయాలు.. 
అక్టోబరు 25వ తేదీ సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. 
 
అలాగే, నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం. ఆరోజన మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణ ఘడియలు. అందువల్ల నవంబరు 8వ తేదీన 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు మూసివేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు