రెండు తెలుగురాష్ట్రాల్లోను ప్రసిద్దిచెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల్ మృతి చెందడంతో ఆలయాన్ని మూసివేశారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సాధారణంగా ఎప్పటికీ మూయరు. చంద్రగ్రహణమైనా, సూర్యగ్రహణమైనా, ఏ గ్రహణమైనా శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు. కానీ ఆలయ ప్రధాన అర్చకులు మరణించడంతో తెల్లవారుజాము 4 గంటలకు మూసేశారు.