కార్తీక మాసం.. శివాలయాలకు కార్తీక శోభ.. శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలు

సెల్వి

శనివారం, 2 నవంబరు 2024 (11:01 IST)
కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు కార్తీక శోభ వచ్చింది. శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందు కోసం శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయాలను సర్వాంగ సుందరంగా ఆలయ అధికారులు అలంకరించారు. 
 
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజామున 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిరంతర దర్శనం కల్పించారు. 
 
భీమవరం పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. కార్తీకదీపాలను భక్తులు వెలిగిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు