చలికి కూడా లెక్కచేయక భక్తులు రోడ్లపైనే పడిగాపులు కాచారు. నాలుగు మాడవీధుల్లో ఇసుకేస్తే రాలనంత భక్తజనం కనిపించారు. ఎప్పటిలా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశాం.. సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని టిటిడి ఉన్నతాధికారులు ప్రకటనలు చేశారు కానీ అది ఏ మాత్రం సాధ్యం కాలేదు. గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు.
మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావ్, టిడిపి నేతలు సిఎం రమేష్, తెలంగాణా మంత్రులు, సినీనటులు తదితర ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.