ఆయన శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ యేడాది యధావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 1న గరుడసేవ, 2న బంగారు రథం, 4న మహారథం 5న, చక్రస్నానం వేడుకలను నిర్వహిస్తామన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు, వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.