29-06-2022 బుధవారం రాశిఫలాలు ... లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...

బుధవారం, 29 జూన్ 2022 (04:00 IST)
మేషం :- స్త్రీలకు టివి ఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసి వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, దైవసామగ్రి, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావచ్చు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
 
వృషభం :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి.
 
మిథునం :- ఎండుమిచ్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడవచ్చు. స్త్రీలు కొత్త వ్యక్తులతో తక్కువగా సంభాషించండి మంచిది.
 
కర్కాటకం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై దృష్టి సారించాలి. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
 
సింహం :- కుటుంబ సమస్యలను పట్టించుకోకుండా ఇతరులకు సహాయం చేస్తారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం మంచిది కాదు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది.
 
కన్య :- భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మిమ్ములను తప్పుదారి పట్టించి లబ్దిపొందాలని యత్నిస్తారు. సమాచార లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
తుల :- టెండర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. వివాదాస్ప విషయాలకు దూరంగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం గురించి మానసికంగా ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. చిట్స్, ఫైనాన్సు వ్యాపారుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి.
 
ధనస్సు :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. మీ అలవాట్లు, బలహీనతలు గోప్పంగా ఉంచండి. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరదు.
 
మకరం :- గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యా, వైద్య సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించడంతో మానసికంగా కుదుటపడతారు. మీపై శకునాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు.
 
కుంభం :- రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. పాత బకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార వర్గాల వారికి అధికారుల తనిఖీలు, షాపు గుమస్తాల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలు అందరి యందు కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
మీనం :- ఆర్థికపరమైన చర్చలు, కీలకమైన నిర్ణయాలకు ఇది అనుకూలం. గృహంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేపడతారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు