కరోనా వైరస్ కట్టడికి తితిదే చర్యలు - భక్తులకు కరోనా పరీక్షలు

మంగళవారం, 30 జూన్ 2020 (10:57 IST)
కరోనా వైరస్ తిరుమల గిరుల్లో వ్యాపించకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ద్వారా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
సిబ్బందికి రోజూ కరోనా టెస్టులు నిర్వహించడమే కాకుండా, టీటీడీలో ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. లాక్డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తుండడంతో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 
 
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఉద్యోగుల ఆరోగ్య దృష్ట్యా రోజుకు వంద మంది ఉద్యోగులకు కొవిడ్‌ పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. 
 
ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బర్డ్ దవాఖానాను కరోనా రోగులకు ఉపయోగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, తిరుమలకు వచ్చే భక్తులందరికీ విధిగా ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని నిర్ణయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు