తిరుమల, తిరుచానూరు, స్థానిక ఆలయాల్లో రోజుకు దాదాపు 20 వేల కిలోల బియ్యం అవసరమవుతుండగా, కొనుగోళ్లను క్రమబద్ధీకరించేందుకు నెలవారీ సరఫరా షెడ్యూల్‌ను సమర్పించాలని మిల్లర్లను ఆదేశించారు. ప్రస్తుత ఏపీ-తెలంగాణ సరఫరా నిష్పత్తి 60:40గా ఉంది.
ప్రతి నెలా మిల్లర్లతో వర్చువల్ మీటింగ్‌లు నిర్వహించి, ఫీడ్‌బ్యాక్‌ను పంచుకోవాలని, నెలవారీ అన్నప్రసాదం నాణ్యత నివేదికలను-శ్రీవారి సేవకుల ద్వారా సేకరించి.. అభివృద్ధి కోసం అసోసియేషన్‌లకు పంపాలని అధికారులకు చెప్పారు.
టీటీడీ కోసం అధునాతన కోల్డ్ స్టోరేజీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన స్టోరేజీ సొల్యూషన్‌లను పరిశీలించి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, సీఎఫ్‌టీఆర్ఐలను భాగస్వాములను చేయాలని అదనపు ఈవో అధికారులను కోరారు.