కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు..

శుక్రవారం, 7 జులై 2017 (12:09 IST)
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతియేటా ఆషాడ మాసంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకుంటుంటారు.
 
ఈ సారి ఆషాఢ మాసంలో కూడా దేవస్థానం అధికారులు ఉత్సవాలను ప్రారంభించారు. మొదటిరోజు అమ్మవారు వివిధ రకాల కూరగాయల అవతారంలో భక్తులకు దర్సనమిస్తున్నారు. మూడురోజుల పాటు వివిధ అలంకరణలు అమ్మవారికి చేయనున్నారు. రాష్ట్రప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్థి చెందాలని శాకంబరీ ఉత్సవాలను దేవస్థానం నిర్వహిస్తోంది. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు పోటెత్తి కనిపించారు.

వెబ్దునియా పై చదవండి