రామప్ప ఆలయం

గురువారం, 10 ఏప్రియల్ 2008 (16:34 IST)
మన రాష్ట్రంలోని మరో ముఖ్యమైన దేవాలయం రామప్ప దేవాలయం. ఇది వరంగల్‌కు 77 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పాలంపేట్‌లో ఈ రామప్ప దేవాలయం ఉంది. ఆనాడు పాలించిన కాకతీయుల కళా వైభవానికి రామప్ప దేవాలయం మచ్చుతునక వంటిది.

ఈ దేవాలయానికి వన్నె తెచ్చే శిల్పాలను చెక్కిన రామప్ప పేరునే ఆలయానికి పెట్టారు. ఈ ఆలయాన్ని 1213లో కాకతీయ పాలకుడైన గణపతి దేవుడు నిర్మించారు. ఈ ఆలయంలో రుద్రేశ్వరా, కాటేశ్వరా, కామేశ్వరుల ఆలయాలు ఉన్నాయి. ఇవి కూడా శిథిలావస్థలో ఉన్నాయి. అలాగే మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో చాలా వైభవంగా చేస్తారు.

ఈ ఆలయాన్ని కట్టేందుకు ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే మునగకుండా ఉండేంత తేలికగా ఉంటాయంటే ఎవరూ నమ్మరు. అయినప్పటికీ, ఆ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ఆలయం వెలుపల తొమ్మిది అడుగుల ఎత్తున్న నంది విగ్రహం మిమ్మల్ని ఆహ్వానిస్తుంటుంది.

ఈ ఆలయపు గోడలు, పైభాగాలలో ఆలయానికి సంబంధించిన పురాణ గాధలు ఉంటాయి. తప్పకుండా ఈ ఆలయ పర్యటన మీ మనసులో ముద్రగా మిగిలిపోతుంది.

వెబ్దునియా పై చదవండి