భారత పార్లమెంట్ కీలక ఘట్టాలు

FileFILE
భారత పార్లమెంట్ 9 డిసెంబర్ 1946 సోమవారం నాడు ఉదయం 11 గంటలకు తొలిసారిగా సమావేశమైంది. సమావేశంలో 210 మంది సభ్యులు పాల్గొన్నారు. 11 డిసెంబర్ 1946న పార్లమెంట్ అధ్యక్షునిగా డా. రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చివరిదాకా అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగారు. 13 డిసెంబర్ 1946న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంట్ యొక్క ముఖ్యోద్దేశాన్ని పార్లమెంట్ సభలో ప్రస్తావించారు. అదే ప్రస్తావనను 22 జనవరి 1947న పునరుద్ఘాటించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని వాక్యాలను గుర్తు చేసుకుందాం.

1. స్వీయ పరిపాలన విధానాలతో భారతదేశం ఒక సంపూర్ణమైన సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించనున్నది.
2. ఆంగ్లేయులు పాలనలో లేదా పలు సంస్థానాల అధీనంలో లేదా ఈ రెండింటికి చెందని రూపంలో ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాలు సర్వసత్తాక భారతదేశంలో విలీనం కానున్నాయి.
3. భారతదేశానికి ప్రజలే పాలకులుగా వ్యవహరించనున్నారు.

4. భారత ప్రజలకు సామాజిక, ఆర్థిక మరియు రాజనీతి న్యాయం, విశ్వాసం, సంఘ నిర్మాణం, సంభాషణ, భావాలు, పనిలో స్వేచ్ఛ, వృత్తి ఉద్యోగాలు, న్యాయ మరియు సార్వజనిక నైతికత కల్పించబడుతుంది.
5. అల్పసంఖ్యాక వర్గాలు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలు కాపాడే సముచితమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.
6.విశిష్టమైన అధికారాలు ఏకీకృత సమూహం వద్ద ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి