సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

ఠాగూర్

ఆదివారం, 19 మే 2024 (09:25 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొందరు దొంగలు రైలు దోపిడీకి యత్నించారు. సిగ్నల్ లైటుకు బురదపూసి రైలును ఆపేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు సిగ్నల్‌కు బురద పూయడంతో పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ - చండీగఢ్ రైళ్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత రైలులోకి ఎక్కిన దుండగులు.. ప్రయాణికులు వస్తువులు, నగల చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
రైల్వే పోలీసులు, ప్రయాణికులు వెల్లడించిన వివరాల మేరకు.. మొరాబాద్ - సహారన్ పూర్ రైల్వే డివిజన్ లక్సర్ రైల్వే స్టషన్ సమీపంలో ఉన్న రైలు సిగ్నల్‌కు కొందరు దుండగులు బురద పూశారు. సిగ్నల్ కనిపించకపోవడంతో పాటలీపుత్ర, గోరఖ్‌పూర్ - చండీగఢ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రయాణికుల వస్తువులు, నగదును దోపిడీ చేసేందుకు యత్నించారు. 
 
అయితే, ప్రయాణికులంతా కలిసి తిరగబడటంతో వారు పరారయ్యాయి. ఈ లోపు లోకో పైలెట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. లక్సర్ సీఆర్పీఎఫ్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ రవి శివాచ్, జీఆర్పీ పోలీస్ స్టేషన్ హెడ్ సంజయ్ శర్మ, జీఆర్పీ ఎస్పీ సరితో డోభాల్ ఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ యత్నం తీరు తెన్నులను పరిశీలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు