2011 సినిమా రౌండప్: ఇండస్ట్రీలో టాప్ హీరోలు.. టాప్ హీరోలే..!

ఆదివారం, 25 డిశెంబరు 2011 (13:44 IST)
WD
కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ.... పాతసంవత్సరానికి గుడ్‌బై చెప్పే రోజు మరెంతో దూరంలోలేదు. ఒకప్పుడు అలాగే ఉన్నాం. ఇప్పుడు అలాగే ఉన్నాం. కానీ భవిష్యత్‌లో ఎలాగుంటామో మాత్రం చెప్పలేం అని ప్రతి హీరో అంటాడు. రంగుల ప్రపంచంలో మొఖానికి రంగుపూసుకునే హీరోలు తమ గ్లామర్‌ తగ్గకుండా, ఫాన్స్‌ జారిపోకుండా.... చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏదో నాజీవితం ఇలా గడిచిపోతుందనుకునే సామాన్యుడిలా హీరోలు ఉండలేరు. రోజు రోజుకూ తమ వృత్తిలో అభివృద్ధిని వెతుక్కుంటూ పోవాల్సిందే. అందుకే 2010 నుంచి చేదు అనుభవాలను చూసిన అగ్ర కథానాయకులు.. దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమంలో 2011నాడు కొంత వెనుకంజ చేశారు. ఈ ఏడాది 112 స్ట్రెయిట్‌ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో టాప్‌ హీరోల చిత్రాలు వేళ్ళపై లెక్కించవచ్చు.

ఎందుకంటే.. ఈ ఏడాది ఏ ఒక్క అగ్రహీరోకు పెద్దగా కలిసిరాలేదు. ఏవో చిన్నపాటి విజయం చవిచూసినా.. దాన్ని మాసిబూసిమారేడుకాయ చేసినట్లుగా చేశారు. పైగా ఇండస్ట్రీపై ప్రాంతీయవాదం ప్రభావం కొట్టవచ్చినట్లు కన్పించడంతో అగ్రహీరోలు సినిమాల నిర్మాణానికి వెనుకంజ వేశారు. మిగిలిన కొంతమంది హీరోలు చేసినా అవి రికార్డ్‌లవరకే పరిమితం అయ్యాయి కానీ... నిర్మాత జేబులో మాత్రం పెద్దగా పడిందిలేదు.

WD
టాప్‌ టెన్‌ హీరోలంటే.. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున.. వెంకటేష్‌, పవనకళ్యాణ్‌, ఎన్‌.టి.ఆర్‌., రవితేజ, మహేష్‌బాబు...కానీ.. 2011 మాత్రం అందర్నీ నిరాశపర్చింది. చిరంజీవి టాప్‌హీరోల లిస్టులోంచి తీసేస్తే... రాజకీయాల్లో వెళ్ళి తను అక్కడైనా టాప్‌లో ఉండాలనుకుని... ట్రాప్‌హీరో అయిపోయాడు.

సేప్‌సైడ్‌ హీరోలయ్యారు
ఈ ఏడాది టాప్‌హీరోలకంటే.. సేఫ్‌సైడ్‌ హీరోలుగా ఉంటేచాలని అగ్రహీరోలు ఆలోచించేస్థాయికి చేరింది. రవితేజ సేఫ్‌సైడ్‌ హీరోగా పేరు తెచ్చుకుంటే... అంతేస్థాయిలో నిర్మాతల హీరోగా అల్లరి నరేశ్‌ పేరుతెచ్చుకున్నాడు.

FILE
ఎక్కువ చిత్రాలు చేసినవారు
ఈ ఏడాది రవితేజ, అల్లరి నరేశ్‌ నటించిన 3 చిత్రాలు విడుదలయ్యాయి. వీరితో పాటు సమానంగా ఉన్నానంటూ.. జగపతిబాబు గబాగబా చిత్రాలు చేయడం మొదలుపెట్టి తనూ 3 చేశాడు. సిద్ధార్థ కూడా 3 చిత్రాలు అయ్యాయి. సుమంత్‌ 3 విడుదలయ్యాయి.

బాలకృష్ణ పరమవీరచక్రగ్రేట్‌ డైరెక్టర్‌దాసరితో నటిస్తే అది కాస్త పరమబోరుగా మిగిలిపోయింది. చేసినా ఫలితం లేదని బాలకృష్ణ ఫీలయి.... అనుకోకుండా వచ్చిన అవకాశం 'శ్రీరామరాజ్యం' చేశాడు. పౌరాణికచిత్రాల్లో బాగా ఆదరణ ఉందనుకున్నా... కలెక్షన్లపరంగా నిర్మాతను నిరుత్సాహపరిస్తే... నటుడిగా బాలయ్యకు మంచిమార్కులు పడ్డాయి. దాంతో టాప్‌లో 10లోని స్థానం చివరికి వెళ్ళింది.

ఎన్‌.టి.ఆర్‌.కు ఈ ఏడాది ఒకరకమైన పరీక్షే.. తన ఒక ఇంటివాడయ్యాక.. చేసి సినిమాలు ఆయన కెరీర్‌పై పడ్డాయి.. 'శక్తి' వంటి పవర్‌ఫుల్‌ చిత్రాన్ని చేస్తే.. అదిపెద్దగా ఆడకపోగా... రొటీన్‌గా పేరు తెచ్చుకుంది. గతంలో చేసిన బృందావనం కాన్సెప్ట్‌పై మళ్ళీ కానసన్‌ట్రేషన్‌ చేసి... 'ఊసరవెల్లి'గా ముందుకు వచ్చాయి. ఇదీ పెద్దగాఆడలేదు. కాకపోతే.. ఓపెనింగ్స్‌పరంగా బాగావచ్చాయనే తృప్తి మిగిల్చుకున్నాడు. దాంతో టాప్‌ 5 తర్వాత స్థానాన్నిదక్కించుకున్నాడు.

WD
పవన్‌కళ్యాణ్‌... గ్యాప్‌తో ఈ ఏడాది విడుదలచేసిన సినిమా..పంజా... కొత్త గెటప్స్‌తో. గెడ్డంపెట్టి... మాస్‌ను ఆకట్టుకోవాలనుకున్నా ఆశలు ఫలించలేదు... పెట్టిన 45కోట్ల పెట్టుబడి రాక నిర్మాత కాస్త నిరాశపడ్డాడు.. పక్కా మాఫియా చిత్రాలు... బాలీవుడ్‌తోపాటు వర్మ సినిమాలు చూసిన ప్రేక్షకులకు ఇది పెద్దగా లాభించలేదు.

అక్కినేని నాగార్జున... పయనం.. అంటూ డబ్బింగ్‌ చిత్రంతో కొత్తప్రయోగం చేసి ఏవరేజ్‌ సినిమాగా తెచ్చాడు. విమానం హైజాక్‌ కాన్సెప్ట్‌ కాస్త కొత్తగా అనిపించింది. మళ్ళా... తెలంగాణ దొరల పోరాటయోధుడు రాజన్న కథతో డిసెంబర్‌లో ముందుకు వచ్చాడు. ఆసినిమా బాగానే ఉండడంతో మంచి మార్కులు కొట్టేశాడు. కానీ.. ఆంధ్రలో ఆ చిత్రం ఇంకా పుంజుకోవాలి. తెలంగాణా గొడవల కారణంగా... ఆశించిన వసూళ్ళురాలేదు.

రవితేజ మిరపకాయ్‌, దొంగలముఠా..వీరా.. చిత్రాలు విడదులయితే... మిరపకాయ్‌ద్వారా నిర్మాతగా పరిచయమైన పి.రమేస్‌ కుమార్‌ చాలా హ్యీపీగా ఉన్నాడు. దాన్ని క్యాష్ చేసుకుందామని.. రామ్‌గోపాల్‌వర్మ తీసిన దొంగలముఠా... రవితేజకు డిజాస్టర్‌ ఇచ్చింది. దాంతో.. మళ్ళీ ఇలాకాదని... పక్కా మాస్‌ మసలా ఫార్ములాతో సినిమాతీసి.. వీరా పేరుపెట్టాడు. ఆ చిత్రం నరసింహనాయుడుకు జిరాక్స్‌లా అనిపించడంతో.. ప్రేక్షకులు ముందు వీగిపోయాడు... కాబట్టి.. రవితేజకూడా.. టాప్‌ 5లోంచి వెనక్కి నెట్టబట్డాడు.

అల్లు అర్జున్‌ పరిస్థితికూడా ఎన్‌.టి.ఆర్‌.లాగే మారింది. తనూ కొత్త పెండ్లికొడుకు అయ్యాక..... రాబోయే సినిమా బద్రినాథ్‌ కనుక. పెద్ద హోప్స్‌ పెట్టుకున్నాడు. వివి వినాయక్‌ వంటి అగ్రదర్శకుడయినా... అర్జున్‌కు లక్క్‌దొరకలేదు. దీంతో.. అటు వినాయక్‌ కూడా...పని అయిపోయిందనే టాక్‌ వచ్చింది.

FILE
సిద్ధార్థ్‌ హీరోగా డబ్బింగ్‌లో సినిమా 180తో ముందుకువచ్చాడు... ఆ తర్వాత మరో 2 సినిమాలు చేశాడు. ఏవీ పెద్దగా ఆడలేదు. దిల్‌రాజు తీసిన 'ఓ మైఫ్రెండ్‌' సినిమా మాత్రం.. కాస్త ఆటు ఇటూగా ఆడుతోంది. అయినా ఆయనపై నిర్మాతపెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి.

జగపతిబాబు.. తన సత్తాను మామూలుగా చాటుకోవాలని... వచ్చిన సినిమానల్లా ఒప్పేసుకున్నాడు. జైబోలోతెలంగాణ వంటి తెలంగాణా నేపథ్య చిత్రం చేశాడు. ఆ తర్వాత చేసిన 'కీ'. చిత్రం పెద్దగా ఆడలేదు. సుమన్‌ తర్వాత జగపతిబాబు స్టాండ్‌బై హీరోలుగా పేరు తెచ్చుకున్నారు.

గోపీచంద్‌... వాంటెండ్‌.. అంటూ.. ముందుకువచ్చినా... చూడ్డానికి ఎవరూ రాలేదు. సరే కదాని మొగుడు అని ముందుకువచ్చి.... తాప్సీ ఎక్స్‌పోజింగ్‌తో కూడాహిట్‌ కొట్టలేకపోయాడు. వీరందరికంటే అల్లరి నరేశ్ సునాయాశంగా... అహనా పెళ్ళంట... సీమ టపాకాయ్‌, మడతకాజా.. చిత్రాల్లో మినియం గ్యారంటీ హీరోగా నిలబడ్డాడు.

రామ్‌... కందిరీగతో ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ కొట్టాడు. ఈ ఏడాది నిజమైన హిట్‌.. నిర్మాతకు డబ్బులు వచ్చిందంటే ఈ సినిమానే అని సినీ విశ్లేషకులు తేల్చారు. మొదలైంది 2010లో అయినా కొన్ని అవాంతరాలతో అధిగమించి 2011లో విడుదలై... అసలు నీరసంగా ఉన్న చలన చిత్రరంగానికి కాస్త ఊపిరి పోసింది.

WD
నాగచైతన్య 100%లవ్‌తో సక్సెస్‌ సాధించినా... హీరోయిన్‌కు తమన్నాకు పెద్ద పేరు వచ్చింది. ఆ తర్వాత దడ, బెజవాడ చిత్రాలతో ఆయన సక్సెస్‌ రాలేకపోయాడు.

శ్రీకాంత్‌ తన 100 చిత్రంగా నగ్జలైట్‌ నేపథ్యంతో విరోధి చిత్రాన్ని స్వంత బేనర్‌లో నిర్మించి హీరోగా చేశాడు. నీలకంఠ దర్శకుడిగా ఏదో చేయాలనుకుని చేశాడు. కానీ అది రొటీన్‌ నగ్జలైట్‌ చిత్రంగా మారిపోయింది. కాకపోతే.. గోవా ఫిలిం ఫెస్టివల్స్‌తో ప్రదర్శనకు పనికివచ్చింది.

గత ఏడాది బాలకృష్ణ.. సింహా... కలెక్షన్ల పరంగా ఒక్క ఊపు ఊపితే.. ఈ ఏడాది ఆ ప్లేస్‌ను మహేష్‌బాబు 'దూకుడు'తో ముందుకువచ్చాడు.. తెలిసిన కథే.. అయినా శ్రీనువైట్ల కామెడీ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. అయితే... ఎక్కువ థియేటర్లలో విడుదలకావడంతో... ఆ సినిమాకు కాస్త బూస్టమ్‌ ఇచ్చి.. కలెక్షన్లపరంగా మగధీర రికార్డ్‌లు బద్దలు కొట్టిందంటూ... పేపర్‌ ప్రకటనలు ఇవ్వడంతో... ఆ వైపునుంచి మాదే రికార్డ్‌ అంటూ ఆ నిర్మాతలు ఇచ్చారు. దీంతో ఇది రచ్చగా మారి... అటు నిర్మాత, ఇటు హీరో ఇంటిపై ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులు జరిగాయి. వారితోపాటు సిబిఐ... అవినీతి బాగోలతం పేరిట... విల్సాస్‌ పేరిట లగ్జరీ ఇల్లు ఉన్నట్లున్న మమేష్‌బాబు భార్యపై కేసుకూడా పెట్టాయి.

ఇక,, వీరుకాకుండా... రానా... నేను రా రాక్షసి వంటి. చేసిన కొత్తప్రయోగం ఆకట్టుకోలేదు. వరున్‌సందేశ్‌, విష్ణు, సునీల్‌, సాయికుమార్‌ కుమారుడు ఆది, అలీ, తనీష్‌, శివాజీ, బాలాదిత్య, మనోతేజ్‌, నితిన్‌, వేణు, పరుచూరి రవి, విలన్‌ అజయ్‌ హీరోగా, నిఖిల్‌ హీరోగా.. నవదీప్‌ మీరో.. జెడి. చక్రవర్తి హీరోగా చిత్రాలు చేసినా.... కనీసం ఏవరేజ్‌తో అటు ఇటూగా ఊగిసలాడాయి.

ప్రభాస్‌ ఈ ఏడాది ఒక్కసినిమా విడుదలైంది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా చేసిన ఈసినిమా మంచి ఫలితాన్నిచ్చింది. టోటల్‌గా టాప్‌ టెన్‌ హీరోల చిత్రాలు 2011 పెద్దగా ఆశాజనకంగా లేదు. అందుకే.. ఒకనాడు బల్లు నేడు ఓడలుగా ఉన్నట్లు... చిన్న హీరోలు టాప్‌లోకి వెళ్ళారు..

నాని... అలామొదలైంది..తో హిట్‌ కొట్టి... ఆతర్వాత సెగతో కాస్త వెనక్కువేసినా.... మళ్ళీ పిళ్ళా జమిందార్‌తో ముందుకు వచ్చాడు... దీంతో కలెక్షన్లు బాగుండడంతో... పెద్దసినిమాలు వేసిన థియేటర్లలోనే మళ్ళీ అవితీసేసి.. నాని చిత్రాలు ప్రదర్శించారు. అందుకే ఏడాది టాప్‌10 హీరోలు... నాని.. అల్లరి నరేస్‌, రామ్‌, మహేష్‌బాబు, రవితేజ, నాగార్జున, ప్రభాస్‌ వంటి వారూ ఉన్నారు.

పారితోషకాలు

ఆరు కోట్లు తీసుకునే మహేష్‌బాబు దూకుడతో మరింత పెంచారు.. అదే రేంజ్‌లో ఉన్న ఎన్‌.టి.ఆర్‌. తనకు సక్సెస్‌ లేకపోవడంతో పెంచడానికి కుదరలేదు. పవన్‌కళ్యాణ్‌కు 6కోట్లు ఇచ్చినట్లు సమాచారం. బాలకృష్ణ.. నచ్చితే ఎంతైనా చేసే స్థాయికి చేరుకున్నాడు. కోట్లమీద ఉన్న హీరోల రెమ్మునరేషన్‌ ఒక్కసారిగా... తగ్గించాలని ఫిలింఛాంబర్‌ చూసింది.కానీ సాధ్యపడేలా లేదు.

ఎప్పుడొచ్చామన్నదేకాదు. బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే... అన్న మహేష్‌బాబు డైలాగ్‌బట్టి సినిమా విశ్లేషిస్తే.... ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు ఇచ్చిన సక్సెస్‌ ఊపిరే...ఇండస్ట్రీకి ప్రాణవాయునిచ్చింది. అందుకే.. వారే టాప్‌హీరోలు.

వెబ్దునియా పై చదవండి