2011లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌‌లో టాప్-10 బౌలర్స్!

ఆదివారం, 25 డిశెంబరు 2011 (14:18 IST)
FILE
2011 సంవత్సరంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌‌లో టాప్-10 బౌలర్స్ ఎవరో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి..!
1. లసిత్ మలింగ
ఈ సంవత్సరం అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ శ్రీలంక చెందిన యార్కర్ స్పెషలిస్ట్‌ లసిత్ మలింగ 24 మ్యాచ్‌లో 19.25 సగటుతో 48 వికెట్లు తీసుకున్నాడు. మలింగ ఓవర్‌కు 4.80 పరుగులతో ఈ ఘనత సాధించాడు.

FILE
2. షాహిద్ ఆఫ్రిది
పాకిస్థాన్ చెందిన షాహిద్ ఆఫ్రిది 27 మ్యాచ్‌లో 20.82 సగటుతో 45 వికెట్లు తీసుకున్నాడు. అఫ్రిది ఓవర్ కు 4.18 పరుగులతో ఈ వికెట్లు తీశాడు. 2011 ప్రపంచ కప్‌లో అఫ్రిది అత్యధిక వికెట్ల్ తీసి రికార్డు సృష్టించాడు.

FILE
3. మిచెల్ జాన్సన్
ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ మిచెల్ జాన్సన్ 22 మ్యాచ్‌లో 20.94 సగటు తో 39 వికెట్లు తీసుకున్నాడు. జాన్సన్ ఓవర్‌కు 4.43 పరుగులు ఇచ్చాడు.

FILE
4. సయ్యద్ అజ్మల్
పాకిస్థాన్ చెందిన ఈ యువ స్పిన్ బౌలర్‌కు 2011 సంవత్సరం చిరస్మరణీయంగా గుర్తుంటుంది. ఈ సంవత్సరం టెస్ట్ క్రికెట్‌లో కూడ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 20 వన్డేలు ఆడిన ఈ యువ బౌలర్ 17.08 సగటుతో 34వికెట్లు తీసాడు. ఇతను ఓవర్‌కు 3.48 పరుగులతో ఈఘనత సాధించాడు.

FILE
5. బ్రెట్ ‌లీ
ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్‌గా పేరుగాంచిన బ్రెట్ ‌లీ తన కెరీర్ చివర్లో ఉత్తమ గణంకాలను నమోదుచేసి తన సత్తా నిరూపించుకున్నాడు. లీ 19 మ్యాచ్‌లో ఓవర్‌కు 4.59 పరుగులు ఇచ్చి 21.72 సగటుతో 33 వికెట్లు సాధించాడు.

FILE
6. మహ్మద్ హఫీజ్
పాకిస్థాన్ చెందిన ఈ ఆల్ రౌండర్ ఈ సంవత్సరం బౌలర్‌గా కాకుండా బ్యాట్స్‌మెన్‌గా కూడ టాప్ టెన్‌లో చోటు దక్కించుకొన్నాడు. 32 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్ రౌండర్ 25.34 సగటుతో 32 వికెట్లు తీశాడు. ఓవర్‌కు 3.54 పరుగులు ఇచ్చాడు.

FILE
7. మునాఫ్ పటేల్
మన దేశానికి చెందిన మునాఫ్ పటేల్‌ ఈ క్రమంలో 7వ స్థానంలో నిలిచాడు. 21 మ్యాచ్‌లు ఆడిన ఈ బౌలర్ 27.46 సగటుతో 32 వికెట్లు సాధించాడు. అయితే ఓవర్‌కు 5.37 పరుగులు సమర్పించుకున్నాడు.

FILE
8. టిమ్ బ్రెస్నన్
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ 24 మ్యాచ్‌లు ఆడి 35.50 సగటుతో 32 బ్యాట్స్‌మెన్‌‌ను అవుట్ చేశాడు. అయితే ఓవర్‌కు 5.40 పరుగులు ఇచ్చాడు.

FILE
9. గ్రేమ్ స్వాన్‌
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ స్పినర్ 21 మ్యాచ్‌లు ఆడి 27.51 సగటుతో 31 మందిని అవుటు చేశాడు. అయితే ఓవర్‌కు 4.44 పరుగులు ఇచ్చాడు.

FILE
2011 సంవత్సరంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌‌లో టాప్-10 బౌలర్స్ ఎవరో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి..!
1. లసిత్ మలింగ
ఈ సంవత్సరం అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ శ్రీలంక చెందిన యార్కర్ స్పెషలిస్ట్‌ లసిత్ మలింగ 24 మ్యాచ్‌లో 19.25 సగటుతో 48 వికెట్లు తీసుకున్నాడు. మలింగ ఓవర్‌కు 4.80 పరుగులతో ఈ ఘనత సాధించాడు.

FILE
10. జహీర్ ఖాన్‌
2011 ప్రపంచ కప్‌లో జహీర్ ఖాన్‌ అత్యధిక వికెట్ల్ తీసి భారత్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 14 మ్యాచ్‌లు ఆడి 20.66 సగటుతో 30 వికెట్లు సాధించాడు. ఓవర్‌కు 4.85 పరుగులు ఇచ్చాడు.

వెబ్దునియా పై చదవండి