టాప్‌ హీరోయిన్‌ అంటే....టాప్‌లెస్సా...!!!

శనివారం, 24 డిశెంబరు 2011 (16:28 IST)
WD
నూతనసంవత్సరంలో నా ప్రణాళిక... ఇది నాలక్ష్యం.. జీవితాశయం అంటూ.. పడికట్టుపదాలతో వచ్చిన హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు చూశాక...ఇక్కడంతా మన చేతుల్లో ఏమీలేదని... గ్లామర్‌తోపాటు.. టాలెంట్‌... అదృష్టం కలిసివస్తేనే.. నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చని... గ్రహించారు..

హీరోయిన్లు.. పోటీ తత్వం పెద్దగా లేకపోయినా. నిలబడాలనే ఆలోచనవారిలో కల్గింది.. రిచాగంగోపాధ్యా, శృతిహాసన్‌, స్వాతి, నిత్యమీనన్‌.. దీక్షాసేథ్‌, పూనమ్‌కౌర్‌, తాప్సీ, సమంత, ఇషాచావ్లా, చార్మి, విమలారామన్‌, ఇలియానా, అదితి అగర్వాల్‌, త్రిష, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, సంజన, కమిలీముఖర్జీ, శ్రద్ధాదాస్‌, స్నేహఉల్లాల్‌, సలోని, నిషా అగర్వాల్‌, అమలాపాల్‌వంటి వారు తమ జాతకాల్ని పరీక్షించుకున్నారు. కానీ ప్రేక్షకులు కొందరికే పట్టం కట్టారు.

ఒకప్పుడు త్రిష మంచి పొజిషన్‌లోటాప్‌లో 2,3లో ఉన్న స్థానాన్ని ఈ సారి తీన్‌మార్‌తో ముందుకువచ్చినా.. పవన్‌కళ్యాన్‌ జోడీ పెద్దగా లాభించలేదు. గత ఏడాది అక్కినేని టాప్‌ 10 హీరోయిన్లందరినీ కింగ్‌గా చూపించారు. వారంతా ఆ తర్వాత క్రమేణా ఇద్దరు హీరోయిన్లు సరసన నటించేందుకు ఫ్టాట్‌ఫారం చూపించినట్లయింది.

WD
చార్మి మొదట నుంచి నెంబర్‌వన్‌స్థానాన్ని కొట్టాలని ప్రయత్నిస్తున్నా... కృష్ణవంశీ ఇచ్చిన మొదటిచిత్రం ఫెయిల్‌కాకపోవడంతో.. ఆ తర్వాత మంత్ర వచ్చినా.. పెద్దగా ఉపయోగపడలేదు. ఈ ఏడాది... చార్మి... జగపతిబాబుతో నగరం నిద్రపోతున్నవేళ తీసినా... పెద్దలాభంలేక పోయింది. దాంతో ఆమె చార్మ్‌ తగ్గిపోయింది. లక్షల్లోనే పారితోషికం ఉన్నా... కథ నచ్చితే తక్కువ చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

అలా మొదలైందితో... ముందుకువచ్చిన నిత్యమీనన్‌...తెలుగునటి కాకపోయినా...తన టాలెంట్‌తో ముందుకు సాగింది. కానీ.. ఆమె ఓవర్‌యాక్షన్‌తో '180' సినిమా తర్వాత నోరు దగ్గరపెట్టుకుని మాట్లాడాల్సివచ్చింది. ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది... ఇప్పటి హీరోయిన్లతో పోటీతట్టుకోలేకపోయింది. నటన అనేది నేర్చుకోలేదు. ఎవరైనా నటించవచ్చని... తన సినిమాలు తానే చూడడని కామెంట్‌తో సినిమాలు చేజార్చుకుంది.

FILE
ఈ ఏడాది టాప్‌ 5లో కాజల్‌ అగర్వాల్‌, తమన్నా వస్తారు... మిస్టర్‌ ఫర్‌పెక్టతో సక్సెస్‌ సాధించడంతో కాజల్‌ మళ్ళీ బిజీ అయింది. దానికితోడు తమిళం, బాలీవుడ్‌ రంగంలోనూ ఆఫర్లువచ్చాయి.

ఇక హ్యాపీడేస్‌ తర్వాత కొంతగ్యాప్‌ వచ్చి తమన్నా.. ఈసారి 100% లవ్‌ సినిమాతో ఇండస్ట్రీ పెద్దల్ని ఆకట్టుకుంది. ఆమె ఉంటే సినిమా హిట్‌ అనే స్థాయికి చేరారు. దాంతో నాగచైతన్యతో మరో సినిమా చేయడానికి ముందుకువచ్చింది. ఇవేకాక మిగతాహీరోలుకూడా ఆమెను కావాలని పట్టుబడుతున్నారు.
WD


మరోవైపు డబ్బింగ్‌ సినిమాలు ఆమె చేసినవి తెలుగులో ఆడడం. అవీ సక్సెస్‌కావడంతో. తమన్నా క్రేజ్‌ మరింత పెరిగింది. 25 లక్షలతో కెరీర్‌ ప్రారంభించి...కోటివరకు చేరింది. తెలుగు స్పష్టంగా మాట్లాడే స్థాయికి చేరడంతో.. నిర్మాతలకు చాలా లాభించింది.

FILE


ఒకప్పుడు ఇలియానా నెంబర్‌ 1 స్థానంలోకి చేరింది. టాప్‌ హీరోయిన్‌ స్థాయినుంచి నిదానంగా రేటింగ్‌ తగ్గిపోయింది. ఆమె చేసిన సినిమాలేమీ పెద్దగా కిక్‌ ఇవ్వలేదు. ఎన్‌.టి.ఆర్‌. శక్తి నిరాశపర్చింది.

WD
నటవారసురాలిగా కమల్‌ఫ్యామిలీ వచ్చిన శృతిహాసన్‌ ఓ మై ఫ్రెండ్‌తో కాస్తోకూస్తో నటనను ప్రదర్శించింది. అయితే ఆ నటన కేవలం ఒక మోస్తరు నటిగానేకానీ.... పెద్దరేంజ్‌లో ఉన్న హీరోయిన్‌ మాత్రంకాదు.

WD
తాప్సీ... అందాలతో మొగుడు ముందుకువచ్చింది. ఎంత ఎక్స్‌పోజింగ్‌ చేసినా... ఆమెకు లాభించలేదు. సమంత తన ప్రతిభతో ముందుకు పోతున్నంది. ఇక్కడ టాలెంట్‌ కంటే లక్‌ ముఖ్యమని గ్రహించింది. అదే స్టేట్‌మెంట్‌కూడా ఇస్తూ... తక్కువటైమ్‌లో ప్రముఖ హీరోల చిత్రాల్లో బుక్‌కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది.

FILE
మర్యాదరామన్నతో గత ఏడాది ఒక ఊపు ఊపిన సలోనీ... ఈసారి డిజాస్టర్‌ సినిమా చేసింది. తెలుగమ్మాయిగా వస్తే.. అందులో డబల్‌ఫోజ్‌తో చేసినా లాభంలేకపోయింది. సపోర్ట్‌ హీరోలు కొత్తవారు కావడంతో... కథాంశం రొటీన్‌గా ప్రేక్షకులు అనిపించడంతో ఆకట్టుకోలేకపోయింది.

FILE
వీరంతా ఒక భాగమైతే మిగిలినహీరోయిన్లు సంజన, కమిలీముఖర్జీ, శ్రద్దాదాస్‌, స్నేహాఉల్లాల్‌, నిషా అగర్వాల్‌, అమలాపాల్‌వంటి వారుకూడా ఇండస్ట్రీలో ఒక భాగమైపోయారు. ఎంతోకష్టపడి వస్తున్నసినిమా అవకాశాలు అయినా... సక్సెస్‌ కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది.

నెంబర్‌ 1 హీరోయిన్‌గా ఎదగాలనుకుంటున్నారా? అని ఎవరినైనా అడిగితే.. మాకసలు ఆ ఆలోచనలేదని అందరూ చెప్పడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే హీరోయిన్‌గా నిలవాలన్నది మా కోరికని ఇలియానా గానీ, సమంత కానీ... సలోనికానీ.. ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇదే... అయితే.. ఆల్‌రెడీ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్న శ్రద్ధాదాస్‌ మాత్రం కొత్త బాష్యం చెప్పింది.... ముగ్గురు సినిమాలో కాస్త ఎక్స్‌పోజింగ్‌ చేసింది.
FILE


రామానాయుడు బేనర్‌లో మంచి అవకాశం కానీ.. అది కూడా నిరాశపర్చింది. టాప్‌ హీరోయిన్లు ఎవరూలేరు.. అంతా 'టాప్‌లెస్‌' హీరోయిన్లు అంటూ తనో కొత్త అర్థాన్ని ఇచ్చింది. నిజంగా ఆమె చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది.

ప్రవేశం...చాలు.. లక్షలు...
సినిమా హీరోయిన్‌గా అవకాశాలు రావడమే డబ్బులు సంపాదించుకోవడానికి మార్గంగా హీరోయిన్లు కనిపెట్టారు. అందుకే చిన్నాచితక సినిమాలు చేసిన హీరోయిన్లు మొదలుకొన్ని పెద్ద హీరోయిన్లు వరకు అంతా.. వ్యాపారప్రకటనలపై మొగ్గు చూపుతున్నారు.

కేవలం షాపులకు రిబ్బన్‌ కచింగ్ చేస్తేనే... లక్షలు వచ్చిపడడంతో.... ఇదో మార్గంగా వారు భావించారు. దాంతో... హీరోయిన్‌గా రెండవ సినిమాలో అవకాశం లేకపోయినా... సెకండ్‌ హీరోయిన్‌గా నటించేందుకు ప్రతిఒక్కరూ సిద్ధమయ్యారు.

వెబ్దునియా పై చదవండి