మీ స్నేహితులతో ఆకర్షణలో పడేది, మీ భావాలను అతిగా పంచుకుని వారిపై కలిగే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఇదో అందమైన అనుభూతి కొందరు నిష్కల్షమైన మనసు కలవారికే లభించే, పంచుకునే కానుక. ఒకరికి ఒకరు సర్దుకుపోయే తత్త్వం, ఒకరిని గౌరవించే తత్త్వం, ఒకరికోసం త్యాగం చేసే తత్త్వం, ఒకరికి ఒకరు అన్నీ అందివ్వడమే కాదు..
ఇచ్చే దాంట్లో ఆప్యాయత, అనురాగం, ప్రేమ, కనికరం, జాలి మిళితమై ఉండాలి. ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకేలా ఉండాలి. నిజమైన ప్రేమగల వ్యక్తికి మనసులో ఎన్ని టెన్సన్స్ ఉన్నా అవి భాగస్వామి దగ్గరపైకి రావని గుర్తుంచుకుంటే చాలు. చివరగా నిజమైన ప్రేమలో ఏ విధమైన జ్ఞాపకాలు ఉన్నాయో అవే కడవరకు ఉంటాయి.
నిజమైన ప్రేమలో పడిన వారికి మనలో మనసుకన్నా భాగస్వామి మనసునే ఎక్కువగా గౌరవిస్తాం. నిజమైన ప్రేమలో పడినప్పుడు స్నేహితుడు, స్నేహితురాలి అలవాట్లు, వాచకం, తత్వం మన అలవాట్లలో, దినచర్యలో కనిపిస్తాయి.