ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేస్తే?

సోమవారం, 13 జనవరి 2014 (14:53 IST)
FILE
ముక్కనుమ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది. ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు 'సావిత్రి గౌరివత్రం' అంటే 'బొమ్మల నోము' పడతారు.

దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.

ఇక సంక్రాంతినాడు ఎంత బాగా దానాలు చేస్తే అంత మంచి జరుగుతుందంటారు. అలాగే ఆ రోజున చిన్నపిల్లలు పని గట్టుకుని అయినా సరే పెద్దలకు పాద నమస్కారాలు చేయాలి.

ఇలా పెద్దలను మొక్కడం ద్వారా చిన్నలు వారి ఆశీస్సులు పొందుతారు. ఇలా మొక్కులకు సంబంధించిన పండుగ కనుకనే సంక్రాంతిని మొక్కుల పండుగ అని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు అంటున్నారు. మరి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!

వెబ్దునియా పై చదవండి