ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది.
అయితే ఈసారి భోగి పండుగ అమావాస్య రోజు రావడంతో పలుసందేహాలు కలుగుతున్నాయి. కానీ ఈ అమావాస్య భోగి రోజు ఈశ్వరార్చన, రుద్రాభిషేకం, పితృ, తిలా దానం తిలా తర్పణాలు, స్వయంపాక దానాలు, వస్త్రదానాలు చేయడం వలన విశేషమైన ఫలితం వస్తుంది.
భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వలన శ్రీలక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లలఫై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని విశ్వాసం.