ఆపత్కాలంలో పతి ధర్మం..!!

బుధవారం, 10 సెప్టెంబరు 2008 (17:08 IST)
WD PhotoWD
వార్త : మరాఠీ భాషను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకై జయాబచ్చన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆమె భర్త, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా డిమాండ్ చేశారు.

చెవాకు : తన వ్యాఖ్యలకు ఆమె పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత కూడా ఏమిటీ రాజకీయం. తను అనాలోచితంగా ఆ మాటలు అన్నానని, ఎవరైనా బాధపడితే క్షమాపణ కోరుకుంటున్నానని బహిరంగంగా చెప్పారుగా.

అటు తర్వాత కూడా ఇంకా ఏ రీతిలో క్షమాపణలు కోరాలో ఆ నేతలే చెప్పాల్సి ఉండగా, వారికి మీరు వంత పాడటమేమిటి? ఆమెకు సంబంధించిన రాజకీయ పార్టీ (సమాజ్‌వాదీ) అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తుండటమైనా ఫరవాలేదు.

ఇంతకాలం ఆమెతో కలసి కాపురం చేసిన మీరు కూడా ఆమెను అందరి ముందు బహిరంగంగా చీవాట్లు పెట్టడం ఏమంత బాగోలేదు. ఔను, ఈ వ్యవహారం మొత్తంలో ఏమైనా రాజకీయం ఉందా, మీరైనా చెప్పండి బచ్చన్ గారూ.

వెబ్దునియా పై చదవండి