ఈ గొడవ మీకెందుకు?

మంగళవారం, 9 సెప్టెంబరు 2008 (17:31 IST)
వార్త: కాంగ్రెస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిరంజీవితో తాము సమావేశం కావాలనుకుంటున్నా అల్లు అరవింద్ అడ్డు పడుతున్నారని ఆరోపించారు.

చెవాకు: మీ కెందుకీ తంటా పాల్ గారూ, టీడీపీ, ప్రజారాజ్యంల వరకయితే ఏదో తాము ప్రత్యామ్నాయమని చెబుకున్నా ఏదో ప్రజలు వినడానికి ఆసక్తి అయినా చూపుతారు. మీరూ ఎందుకు ఆ గోదాలో దిగడం.

అది సరే, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న మీరు చిరంజీవితో భేటీకి ఉబలాటపడటమెందుకు. అవసరమైతే వాళ్లే మీ వద్దకు వస్తారుగా. అంటే మీ బలం పైన మీకు గట్టి నమ్మకముందన్న మాట.

వెబ్దునియా పై చదవండి