వార్తః పార్టీ కార్యవర్గం ఒత్తిడికి తలొగ్గి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్న తెరాస చీఫ్ కె. చంద్రశేఖరరావు డబుల్ స్పీడ్తో తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రకటించారు.
చెవాకుః ఎట్టకేలకు రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మంచి పని చేశారు. ఒక్క ఎన్నికలో ఓడినంత మాత్రాన ఉద్యమం ఆగిపోయినట్టు కాదనే విషయాన్ని తెలుసుకున్నారు. తెలంగాణాలో ఇప్పటికీ మీ పార్టీయే నెంబర్ వన్. లోపాలు సరిదిద్దుకుని, డబుల్ స్పీడ్తో ముందుకు వెళదామన్నారు. అయితే స్పీడ్ పెంచే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మరువవద్దు. అలాకాక బ్రేకులు తీసేసి వేగంగా ముందుకెళదామనుకుంటే...ఘోర ప్రమాదాలు జరగవచ్చు. లోపాలను సరిదిద్దుకోవడమంటే...అందర్నీ కలుపుకుని పోవడమే అనే విషయం మీకూ తెలుసనుకుంటా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే ఫలితాలుండవచ్చునేమో.