సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

ఠాగూర్

మంగళవారం, 1 జులై 2025 (20:15 IST)
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉద్వాసన పలకనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. సిద్ధూ స్థానంలో కొత్త నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నట్టు సమాచారం. ఈ ప్రచారంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు అంటూ ఏదీ ఉండదని స్పష్టం చేసింది. ఇది ముమ్మాటికీ బీజేపీ కుట్రేనంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా వెల్లడించారు. 
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన వర్గానికి చెందిన నాయకుల ప్రకటనలతో మొదలైన ఈ వివాదం కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలోనే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఒక సీనియర్ ఎమ్మెల్యే ఫోన్ సంభాషణకు సంబంధించిన వీడియో లీక్ కావడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. 
 
కొద్ది రోజులుగా కర్నాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారని, రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారని ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఈ నేపథ్యంలో స్పందించిన డీకే శివకుమార్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. 
 
నా తరపున ఎవరూ మాట్లాడొద్దు... పార్టీ ప్రయోజనాలే నాకు ముఖ్యం. మనమంతూ 2028 ఎన్నికలపై దృష్టిపెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవు. మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో పనిచేస్తున్న ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తగా అధిష్టానం ఆదేశాలను పాటించడమే తన విధి అని ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు