దీనికేనా బయటికొచ్చింది

మంగళవారం, 30 సెప్టెంబరు 2008 (16:05 IST)
వార్త : ప్రాంతీయ పార్టీలతో కాక కేంద్రంలో తెలంగాణాకు మద్దతు ఇచ్చే పార్టీతోనే తెలంగాణ పార్టీలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చిన తల్లి తెలంగాణ చీఫ్ విజయశాంతి ఈ విషయంలో కాంగ్రెస్ మోసం చేసినందున తెలంగాణ సాధనకు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడమే మంచిదని సూచించారు.

చెవాకు : బీజేపీపై అంత గట్టి నమ్మకం ఉంటే మీరు తిరిగి ఆ పార్టీలోనే చేరిపోవచ్చు కదా. బయటికొచ్చి ఆ పార్టీ‌తోనే తెలంగాణ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని లాబీయింగ్ చేయడమేంటి. మీ ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకే ఇలా చెబుతున్నారా?

ప్రజారాజ్యంతోకానీ, టీడీపితో కాని తెరాస పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు లేక బాలకృష్ణ, చిరంజీవిలకు దక్కే ప్రాధాన్యం మీకు దక్కదనుకుంటున్నారా. అక్కడ ఉన్న సినీ తారల మధ్య మీరు నామమాత్రంగా మారిపోతారనుకుంటున్నారేమోనని పిస్తోంది.

ఔను మీ పార్టీనే నేరుగా తెరాసలో కలిపేయాలని కేసీఆర్ అడిగారుగా. దానిపై ఇంకా మీరు నిర్ణయం తీసుకోలేదుగా, ఈ సమయంలో మీరు సూచన చేస్తే దానిని ఆయన పట్టించుకుంటారా.

లెక్కలు వేసి రాజకీయాలు నడుపుతున్నకేసీఆర్ అవసరం ఏర్పడితే మీరు కాదన్నా టీడీపీతోనో, ప్రజారాజ్యంతోనే పొత్తు పెట్టుకోవడాన్ని వదులుకోరు. అసలింతకీ తెరవెనుకన జరుగుతున్నట్టు చెబుతున్న పొత్తు సన్నాహాలపై మీతో ఏపుడైనా కేసీఆర్ చర్చించారా?

వెబ్దునియా పై చదవండి