భలేగుంది దత్తన్నా!

వార్త: తమ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15న హైదరాబాద్‌లో అద్వానీ విజయ సంకల్ప యాత్ర చేపట్టనుండగా, తాను 20న వేముల వాడలో తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర, 21న ఇచ్చాపురంలో కృష్ణం రాజు ఆధ్వర్యంలో మరో యాత్ర, బంగారు లక్ష్మణ్ 22న మరో యాత్ర, దగాపడ్డ రాయలసీమ పేరుతో మరో యాత్రను ప్రారంభించి, అక్టోబర్ ఆరు వరకు కొనసాగించనున్నామని బీజీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు.

చెవాకు: అందుకే చెప్పేది మీ రేం చేసినా వెరైటీగానే ఉంటుందని. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కో యాత్ర చేపడుతుండగా, మీ పార్టీ మాత్రం ఇలా ఏకకాలంలో ఐదు యాత్రలు చేపట్టడం ద్వారా మీ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నించడం బాగానే ఉంది.

కానీ ఈ పని కాస్త అందరికన్నా ముందే చేసి ఉంటే బావుండేదేమోననిపిస్తోంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నేతలు జరిపిన ఈ యాత్రలతో ప్రజలు చాలా అలసి పోయినట్టున్నారు. వాళ్ల అలసటతో మనకేంలే అనుకుంటున్నారేమో! ఔన్లే మీ యాత్రకు వచ్చే జనానికి (మీ కార్యకర్తలేగా) ఆ అలసట పెద్ద లెక్క కాకపోవచ్చులే.

వెబ్దునియా పై చదవండి