వార్త : వివిధ పార్టీల ప్రచారకర్తలుగా సినీ అగ్ర 'హీరోలు'
చెవాకు : రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కరెంటు కరువు, నీళ్ల కరువుని అనుభవిస్తున్న ప్రజలకు సినిమాల కరువు కూడా ఎదురుకానుందేమో... అబ్బే ఇది మన మాట కాదండీ... పేరున్న హీరోలంతా పార్టీల ప్రతిష్టను పెంచే పనిలో బిజీగా మారిపోతే వారు ఇక సినిమాల్లో నటించేదెపుడు... ? అంటూ సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు.
అసలు హీరోలంతా సినిమాలు మానేసి ఇలా రాజకీయ ప్రచారాలకు బయలుదేరి సినిమాల ఊసే మర్చిపోతే 'మాకిక సినిమాలు కూడా కరువేనా' అంటూ ఆ తెలుగు ప్రేక్షకుడు పాపం తెగ ఫీలైపోతున్నాడు.